భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్టు సిరీస్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లతో బరిలోకి దిగింది. రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. అక్షర్ పటేల్ కూడా కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇరు జట్లు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో ఆడుతున్నాయి.

