2025

ఢిల్లీ పేలుడు ఘటనలో మరో కారు గుర్తింపు

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో మరో కీలక ఆధారం బయటపడింది. దర్యాప్తు అధికారులు మూడో కారును గుర్తించారు. జిహాదీ షాహిన్‌ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన మారుతీ బ్రెజా వాహనం అల్‌-ఫలాహ్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కారు కూడా పేలుడు కుట్రలో భాగమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటికే రెండు వాహనాలపై కీలక ఆధారాలు దొరికిన నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఢిల్లీ పేలుడు ఘటనలో మరో కారు గుర్తింపు Read More »

కోదాడ: వెయిట్ లిఫ్టింగ్, కరాటే పోటీల్లో రాణించడం అభినందనీయం

కోదాడ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు వెయిట్ లిఫ్టింగ్, కరాటే క్రీడల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. భద్రాచలంలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్, నల్లగొండలో జరిగిన కరాటే పోటీల్లో వీరు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఎంఇఓ సలీం షరీఫ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుశీలబాయి, పీడీ నీరజ పాల్గొన్నారు.

కోదాడ: వెయిట్ లిఫ్టింగ్, కరాటే పోటీల్లో రాణించడం అభినందనీయం Read More »