తెలంగాణలో చలి తీవ్రత.. 8.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి తీవ్రంగా పెరుగుతోంది. ఆదిలాబాద్ అటవీ బెల్ట్ లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుతున్నాయి. గురువారం ఉదయం కుమురం భీమ్ ఆసిఫాబాద్‌లోని తిర్యాణి మండలంలో రాష్ట్రంలోనే కనిష్టంగా 8.2 డిగ్రీలు నమోదైంది. రుద్రంగి వద్ద 9.1, నేరడిగొండలో 9.5 డిగ్రీలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలుగా నమోదయ్యాయి. వచ్చే 3 రోజుల్లో చలి మరింత పెరుగుతుందని ఐఎండీ హెచ్చరించింది.
తెలంగాణలో చలి తీవ్రత.. 8.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు Read More »






