గురువారం రాత్రి మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై డిసిఎం వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరొకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి జేసిబీ డ్రైవర్ సిరాజ్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

