ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో మరో కీలక ఆధారం బయటపడింది. దర్యాప్తు అధికారులు మూడో కారును గుర్తించారు. జిహాదీ షాహిన్ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన మారుతీ బ్రెజా వాహనం అల్-ఫలాహ్ యూనివర్సిటీ ప్రాంగణంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కారు కూడా పేలుడు కుట్రలో భాగమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటికే రెండు వాహనాలపై కీలక ఆధారాలు దొరికిన నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

